Ganga Ekadikeltundi (Telugu)
ఈ నవలలో గంగ ఒక ప్రభుత్వాధికారి. పెళ్లి చేసుకోకుండా కన్యగానే ఉండిపోయిన ఆమె... ఒకానొక సందర్భంలో ఆమె మామయ్య విసిరిన సవాల్‌ను స్వీకరించి 'తన శీలం దోచుకున్న వ్యక్తిని వెతికి మరీ కలుసుకుంటుంది. కానీ అప్పటికే అతను వివాహమై పెళ్లి కెదిగిన ముగ్గురు పిల్లల తండ్రి స్థానంలో ఉంటూ కుటుంబ సభ్యులచేత తిరస్కరించబడి ఒంటరి జీవితం గడుపుతుంటాడు. అప్పటికే బాగా తాగుడుకు అలవాటుపడిన ఆమె, అతని సహచర్యంలో మామూలు మనిషై, ఒక పెద్ద మనిషి తరహాలో తన అన్న పిల్లలకు మార్గదర్శిగా ఉంటూ.. చివరకు అతనితో పాటు కాశీకి వెళ్లిపోతుంది. అక్కడే కొన్నాళ్లు గడిపాక చివరకు ఆమె గంగానదిలో సంగమమై తనువు చాలిస్తుంది.
అద్భుతమైన కథా కథనంతో సాగిన ఈ నవల మూడు దశాబ్దాల క్రితమే నవ్యతను, ఆధునికతను సంతరించుకున్న నవలగా పేరొందింది. స్త్రీ పురుష సంబంధాలపై జయకాంతన్‌కున్న తిరుగులేని ఆధిపత్యాన్ని ఈ నవలలో మనం చూడొచ్చు.
-
Author: Jayakanthan
- Publisher: Pallavi Publications (Latest Edition)
-
Paperback: 155 Pages
- Language: Telugu