Abhinetri Savitri (Telugu)
తెలుగు చలనచిత్రసీమను సుసంపన్నంచేసి భారతీయ భాషల్లో 'తెలుగు'కు విశిష్ట స్థానం కల్పించిన నటీనటులు ఎందరో.... అందులో కొందరు ఇప్పటికీ వెలుగులిచ్చే కాంతి రేఖల్లా సినీవినీలాకాశంలో ధృవతారల్లా వెల్గొందుతూనే ఉన్నారు. ఐదు దశాబ్ధాల తెలుగు చిత్రాల్లో ''మహానటి సావిత్రి''ది వైవిధ్య భరతిమైన విశిష్ట స్థానం.. ఆమె స్థానం చెదరనిది. ఆమెను గురించి నేటితరానికి చెప్పబూను కోవటం చంద్రునికో నూలు పోగులాంటిది. ఆ కళామాతల్లికి కళాభివందనాలు తెలుపుకుంటూ ఆమె అభిమానులకి కొన్ని విషయాలైన చెప్పేందుకు చేసిన చిరుప్రయత్నం ఈ ''అభినేత్రి సావిత్రి.
ఎన్నో చిత్రాలలో కధ ఇతివృతమయిన ఆత్మాభిమానంతో మనసుకి, సాంప్రదాయాలకి మధ్య నలిగిపోయే సంఘర్షణాత్మక అంశాలను తన నటనా పటిమతో ప్రదర్శించిన సావిత్రి గురించి చెప్పాలంటే ఒక గ్రంథం అవుతుంది. ఆ గ్రంధాన్ని రచించే వయస్సు గాని, అనుభవం గాని లేకపోయినా ఈ తరం ప్రేక్షకులకు తెలియచేసే చిరుప్రయత్నం ఈ ''అభినేత్రి సావిత్రి''.
- Author: Abhiram
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Language: Telugu