Telugu Adyapana Vidhanam (Telugu)
తెలుగు బోధన పద్ధతులపై రెండుమూడు పుస్తకాలకన్నా లేవు కాబట్టి ఈ గ్రంథం అధిక ప్రసంగం కానేరదు.
పాఠశాలలో, సంఘంలో మాతృభాష స్థానం పెరుగుతుండటం వల్ల మాతృభాషోపాధ్యాయుల బాధ్యత పెరుగుతోంది. భాషాజ్ఞానం ఒక్కటే ఉపాధ్యాయులకు చాలుననే రోజులు గతించి, పద్ధతుల అవసరం స్థిరపడింది. పద్ధతి బద్ధమైన బోధన బాలలకు, తమకు కూడా లాభకరమని ఉపాధ్యాయులు గ్రహిస్తున్నారు.
తెలుగు బోధన పద్ధతుల వివిధ సమస్యల ఆంతర్యాన్ని గ్రహించి, ఉపాధ్యాయులు వాటిని స్వతంత్రంగా ఎదుర్కోటానికి సహాయపడేట్లు ఈ పుస్తకాన్ని రాశాను. శిక్షణ పరీక్షలకు మాత్రం కావలసిన అంశాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు అందించలేదు కాబట్టి, పరీక్షల దృష్టితో దీనిని చదివేవారికి కొంత ఆశాభంగం తప్పదు. ప్రశ్నలు కూడా చర్చకు దోహదాలుగా ఉంటాయి. అనేక ప్రశ్నలకు ఉపాధ్యాయులు తమ అనుభవాన్నీ, ప్రయత్నాన్నీ పరిశీలించుకోవలసి ఉంటుంది. కాబట్టే వాటిని పరిశీలనాంశాలు అన్నాను.
-
Author: Sathiraju Krishna Rao
- Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu