Pillala Bommala Tenali Ramakrishna (Telugu)
ఒక రోజు ఒక ప్రసిద్ధ కవి పుంగవుడు రాయల ఆస్థానానికి విచ్చేశాడు. అతడు మహారాజుతో ఇలా అన్నాడు. ''మహారాజా! నన్నయ్యవేమ అనే రాజు గురించి నేనొక పెద్ద కావ్యం రాశాను. అయితే ఆ కావ్యార్థాన్ని అర్థం చేసుకోగల కవిగానీ, పండితుడు గానీ నాకింతవరకూ కన్పించలేదు. మీ ఆస్థానంలో గల అష్టదిగ్గజాలయిన కవులలో దీని అర్థాన్ని చెప్పగలవారు వున్నారేమోనని వచ్చాను,'' అని ప్రకటించాడా కవి.
రాజనందన రాజ రాజాత్మజులు సాటి
తలప నన్నయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజులు టి
తలప నన్నయ వేమ ధరణి పతికి
భావ భవ భోగ సత్కళా భావములను
భావ భవ భోగ సత్కళా భావములను
పద్యాన్ని సావధానంగా విన్న కవులందరూ అల్లసాని పెద్దనతో సహా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. స్వతహాగా కవి అయిన కృష్ణదేవరాయలకు కూడా దాని అర్థం గురించి సందేహం తలెత్తింది. తన ఆస్థానంలోని కవులు దాని అర్థాన్ని చెప్పలేరేమోనని ఆందోళనపడ్డాడు. ఆ సందర్భంలో హఠాత్తుగా రామకృష్ణుడు లేచి, ''కవివర్యా ! నేను కూడ ఒక పద్యం రాశాను. అది ఇప్పుడు చదువుతాను. మీరు దాన్ని విని అర్థం చెప్పండి. ఈ లోపు మేం మీ పద్యం గురించి, దాని అర్థం గురించి ఆలోచిస్తాము. ముందు నా రచన వినండి'' అని చదవటం మొదలుపెట్టాడు.
- Author: Reddy Raghavaiah
- Publisher: Swathi Book House
- Paperback: 32 pages
- Pictures Colour: Colour Pictures
- Languages: Telugu
- Ages: 0-10