Hasya Kadambam (Telugu)
కళప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1867లో పశ్చిమ గోదావరి జిల్లా, కొండపల్లిలో జన్మించినా వారి కార్యస్థానం రాజమండ్రి. కళాప్రపూర్ణ, ఆంధ్రామిల్టన్, ఆంధ్రాస్కాట్‌గా బిరుదులు పొందిన చిలకమర్తి ప్రధమాంధ్ర నవలా రచయితలలో ఒకరు. కందుకూరి వారికి బాసటగానిల్చి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరు నవల, నాటకం, ప్రహసనం, పద్యనాటకం ఒకటేమిటి రచనా ప్రకియలన్నింటిలోనూ ప్రవేశం ఉన్నవారు. ఆంధ్ర స్వాతంత్రోద్యమ గీతం 'భరత ఖండంబు చక్కని పాడియావు' అనే గీతాన్ని రాశారు. అంతేకాక ఎన్నో వ్యంగ్య రచనలు, నవలలు, ప్రహసనములు వ్రాసి సుప్రసిద్దులయ్యారు. సుమారు 14 నవలలు రాశారు. వీరు వ్రాసిన 'గయోపాఖ్యానం' ఆ రోజుల్లో ప్రతి గ్రామంలో ఆడబడటమేకాక ఎన్నో ముద్రణలు పొందింది. వీరు గ్రాంధికాన్ని సమర్థించినా వీరి శైలి వ్యవహారానికి దగ్గరగా ఉండి నేటి పాఠకులను చదివింపజేస్తుంది. హాస్యకదంబం-1 ముఖ్యంగా వ్యంగ్య, హాస్య ప్రధానమైన రచన.
-
Author: Chilakamarthi Laxminarasinham
- Publisher: Pallavi Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu