Viriah - వీరయ్య Paperback – 17 August 2020

Sale price ₹ 240.00 Regular price ₹ 275.00

Viriah - వీరయ్య Paperback – 17 August 2020

చాలాకాలం క్రితం... ఏడు తరాలు' పుస్తకం చదివి

అర్ధరాత్రి వేళ... బిగ్గరగా ఏడ్చా..! అది నేను ఆ పుస్తకానికిచ్చిన గౌరవం! ప్రపంచం అంతా 'బ్లాక్ బైబిల్' గా పరిగణించిన పుస్తకం రూట్స్ !

ఆ పుస్తకాన్ని ఆ పాత్రలని ఆ రచయిత 'అలెక్స్ హెలి'ని ఎప్పుడు తలుచుకున్నా కన్ను చెమరుతుంది !

అలాంటి మరో సజీవ చిత్రణ 'వీరయ్య'. కడుపు చేత్తో పట్టుకుని ఓడెక్కిన రైతు కూలీలు దేశాంతరాలు

తమ రక్తమాంసాలని... ఆ చెరుకుతోటలకి ఎరువుగాను...

తమ కన్నీటిని నీరుగాను....

తమ చెమటను చెరుకుగడకి తీపిగాను ఎక్కించిన తీరు..!

కదిలిపోతాం ...

మనకి తెలియకుండానే... గుండె చిలకబడి అది కళ్ళ గుండా... చెమ్మగిల్లి... నిశ్శబ్దంగా చెక్కిళ్ళ మీదనించి ధారలుగా జారుతుంది !

మన ముత్తాత ఫోటో సంపాదించడమే అసాధ్యం అయ్యే ఈ రోజుల్లో... రచయత కృష్ణ తన మూలాన్ని వెతుక్కుంటూ చరిత్రపుటల్లోకి... తవ్వుకుంటూ వెళ్ళిపోయి... అక్కడినించి... ఘనీభవించిన... తమ పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి... 'వీరయ్య'గా మన ముందు పరిచాడు.

అందుకే కొన్ని సంఘటనలు కఠినంగా మెరుస్తూ వుంటాయి ! ఈ పుస్తకం... ఏకబిగిన చదవకండి ! గుండె తట్టుకోలేదు..! కన్నీరు ఇంకి పోతుంది..! ఊపిరి కూడా ఆగిపోవచ్చు..!! అంచెలంచలుగా చదివి...అనుభూతి చెందండి..! ఈ పుస్తకం వల్ల...మనకి రెండు విషయాలు తెలుస్తాయి..! ఒకటి... మనిషి మీద సాటి మనిషి క్రౌర్యం..!!

రెండు, ఒక మనిషి... కష్టాలకు ఎదురొడ్డి ! మానవ జాతికంతటికీ కాంతివంతమైన ఒక దీపస్తంభమై నిలబడ్డం !!

-ఆత్మీయంగా, తనికెళ్ళ భరణి

  • Author: Krishna Gubili and Tanikella Bharani
  • Publisher:  Anvikshiki Publishers Pvt Ltd (1 January 2021)
  • Language: Telugu

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out