Patna - Oka Prema Katha (Telugu) Paperback – 25 September 2020
Sale price
₹ 240.00
Regular price
₹ 250.00
Patna - Oka Prema Katha (Telugu) Paperback – 25 September 2020
ఒక ప్రేమ కథ.
ఒక విఫలమైన ఆశయం కథ.
ఒక విరిగిన మనసు కథ.
ఒక తీరని కోరిక కథ.
ఆ కథ విన్నవాళ్లు ముక్కున వేలు వేసుకున్నారు. ఇన్నాళ్లు నోటి మీద వేసుకున్న వేలు తీసి పొగిడారు. కనీసం అలాంటి గొంతు ఒకటి వుందని గుర్తించారు.
ఆ గొంతు ఇంగ్లీషుతో మొదలుపెట్టి ఇప్పటికి ఎనిమిది భాషల్లో తన కథ చెప్పింది.
ఆ కథ ఇప్పుడు తెలుగులో పలుకుతోంది.
అన్వీక్షికీ సగర్వ సమర్పణ – అబ్దుల్లా ఖాన్ రచన "పాట్నా బ్లూస్"
“పాట్నా ఒక ప్రేమ కథ” గా తెలుగులో - అరిపిరాల సత్యప్రసాద్ అనువాదం.
- సమకాలీన సందర్భంలో ముస్లిం అస్తిత్వ వేదనకి సంబంధించిన దాదాపూ ప్రతి కోణం ఈ నవలలో కనిపిస్తుంది. - అఫ్సర్, కవి, రచయిత
- మండల్ కమిషన్ నుంచి మోడీ ప్రమాణ స్వీకారం దాకా సాగిన 90ల తరం ఆత్మకథ అబ్దుల్లా ఖాన్ రాసిన నవల - పాట్నా ఒక ప్రేమకథ. ఇది ఒక అనుభూతి. మనసుతోనే పలవరించు. బతుకును బతుకుగానే వుండనివ్వు, దానికి వేరే పేరెందుకు? - అనంతు చింతలపల్లి,కవి, సాహితీ విశ్లేషకులు
- భారతీయ సాహిత్యంలో అరుదుగా కనిపించే సమకాలీన ముస్లిం జీవితాల గురించి చేసిన ఒక నివేదిక ఈ నవల. - అమితావ్ కుమార్, రచయిత.
- ప్రేమ, దుఃఖం మరియు ఆకాంక్షల కథ ఇది. అంతే కాదు ఇది పాట్నా నగరపు భావగీతం కూడా! - బిశ్వదీప్ ఘోష్, పాత్రికేయులు
- ఈ కథ మన గుండెల్ని మెలి పెడుతుంది ఇంతలోనే మనల్ని మైమరిపిస్తుంది. ఈ విషాద వీరుని కథ చదివి కన్నీరు పెట్టకుండా ఉండడం కష్టం. - సోవేంద్ర సర్కార్, రచయిత
- Author: Abdullah Khan
- Publisher: Anvikshiki Publishers (25 September 2020)
- Language: Telugu