Lopali Daari Perfect Paperback – 1 January 2022

Sale price ₹ 215.00 Regular price ₹ 250.00

Lopali Daari Perfect Paperback – 1 January 2022

Lopali Dari Short Stories by Sowbhagya సౌభాగ్య అనబడే పాలెళ్ల విజయకుమార్ ఒక బహుముఖీన ప్రజ్ఞగల సాహిత్యవేత్త. ఏదో ఒక సాహిత్య ప్రక్రియలో మాత్రమే కాకుండా కవిత్వం, కథ, నవల, విమర్శ, అధ్యయనాత్మక సాహిత్యం, వ్యక్తిత్వ వికాస ఉద్దీపక సాహిత్యం ఇలాంటి వివిధ విభిన్న రంగాల్లో విశేషమైన కృషిచేసిన ప్రతిభాశాలి. కవిగా, దాదాపు తొమ్మిది సంపుటాలను వెలువరించారు. ముప్పది తొమ్మిది సాహిత్య విమర్శ గ్రంథాలను అందించి నాణ్యమైన విమర్శకునిగా పేరుపొందారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొథె, ఐన్స్టీన్, జాన్ కీట్స్, రస్సెల్, ఖలీల్ జిబ్రాన్, తావో తెచాంగ్, సిసిరో వంటి వ్యక్తుల ఆసక్తికర గ్రంథాలను సరళంగా పాఠకులకు అందించిన పరిశోధకుడు. ప్రధానంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఓషో భావజాలాన్నీ, చింతననూ అనేక గ్రంథాలుగా అందించారు. సాభాగ్య అనేక దశాబ్దాలుగా అనితర సాధ్యమైన ఈ రచనా కార్యక్రమాన్ని నిష్ఠతో కొనసాగించి దాదాపు 195 గ్రంథాలను యిప్పటివరకు వెలువరించారు. ఒక సాహిత్య కారుడు 'సాహిత్య సాధన'ను తపస్సుగా స్వీకరించి, నిరంతర యజ్ఞంగా కొనసాగిస్తే తప్ప ఇంత నాణ్యమైన, ప్రామాణికమైన అక్షర సంపదను సృష్టించడం సాధ్యం కాదు. ఏ.గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా మోతె గ్రామానికి చెందినవారు. 2006లో UK లోని బెడ్ ఫోర్డ్ యూనివర్సిటీ నుండి MBA పూర్తి చేశారు. కొంత కాలం అక్కడే జాబ్ చేసి, తిరిగి ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ లో e-tutors world పేరుతో, మొట్టమొదటి online tuitions అకాడమిని ప్రారంభించారు. 2010 లో ఓ ఫిల్మ్ స్కూల్ నుండి డైరెక్షన్ కోర్స్ చేసి, రెండు తెలుగు సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్గా, సహ రచయితగా పనిచేశారు. 2016 నుండి మాయాజూమ్ ఫిలిమ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి, యాడ్ ఫిలిమ్స్న, డాక్యుమెంటరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. 

  • Author: SOWBHAGYA
  • Publisher: Anvikshiki Books (1 January 2022)
  • Paperback:  280 Pages
  • Language: Telugu

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out