Jnapakaala Varada (Telugu) - 2017
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
వరదాచారిగారు 24-10-1932 న నిజామాబాదు జిల్లా ఆర్మూరులో జన్మించారు. అంటే ఆయన బాల్యమంతా నిజాంపాలనలోనే గడిచింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుకున్నారు. అనంతరం పి.జి. డిప్లమా ఇన్ జర్నలిజం చేశారు. తొలినాటి తెలుగు జర్నలిజంలో జర్నలిజం డిగ్రీతో ప్రవేశించిన అతికొద్ది మంది జర్నలిస్టులలో వరదాచారిగారొకరు. ఆంధ్రజనత, ఆంధ్రభూమి, ఈనాడు పత్రికల్లో జర్నలిస్టుగా ఆయన జీవితంలో సింహభాగం గడిచిపోయింది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం జర్నలిజం బోధించారు. నిబద్ధత, నిజాయితీ గల జర్నలిస్టుగా వివిధ ¬దాలలో సుదీర్ఘకాలం పనిచేయడమే గాక తరువాతి తరాల జర్నలిస్టులను ప్రత్యక్ష బోధన ద్వారా, తన రచనల ద్వారా, జర్నలిజం కోర్సు పుస్తకాల ద్వారా తయారుచేసిన కీర్తి ఆయనకు దక్కుతుంది. జర్నలిస్టుల వృత్తి సంఘాలలోనూ ఆయన క్రియాశీలంగా పనిచేశారు.
- Author:Dr. G.S. Varada Chari
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 272 pages
- Language: Telugu