Indialo Dagina Hindustan (Telugu)
"ఇండియాలో హిందూస్థాన్ అనే అర్థం దాగివుంది. రాజ్యం రూపురేఖలనీ, స్వేచ్ఛకూ అణచివేతకూ మధ్యనున్న సరిహద్దులనీ, దేన్ని అనుమతించాలి దేన్ని నిషేధించాలి వంటి అంశాలన్నింటినీ చాపకింద నీరులాగా ఇండియాలో దాగివున్న ఈ హిందూ అంశే నిర్దేశిస్తోంది."
"స్వాతంత్ర్యం కోసం సాగిన పోరాటంలో చీలిక మతపరంగా వచ్చినదే అయినా అసలు మతపర పదజాలన్నీ, భావజాలాన్నీ జాతీయోద్యమంలో ప్రవేశపెట్టినవాడు జిన్నా కాదు, గాంధీ."
"కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ యావత్ భారతదేశంలో బ్రిటీష్ పాలనకు తానే ప్రత్యామ్నాయం అని చాటుకుంటూ వచ్చింది. అదే ప్రస్తుత సంక్షోభానికీ, చివరకు అనివార్యమైన దేశ విభజనకూ కారణమైంది."
"కులం అనేది ఒక పంజరం లాంటిది. భారత ప్రజాస్వామ్యం ఆ పంజరంలో భద్రంగా ఉంది. కానీ అది అందులోంచి తప్పించుకుని బయటపడవలసి వుంది..."
"భారత రాజకీయాలలో కేవలం 1960ల చివరిలోనే కులం ప్రధానాంశంగా మారిందన్న సాధారణ అభిప్రాయం తప్పు అంటారు రాధికా దేశాయ్. 1967 తర్వాత బయటపడ్డ కుల రాజకీయాలు ఈ వర్గాల రాజకీయ అధికార సాధనలో మొట్టమొదటివేం కావు. అవి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో అంతర్గతంగా పని చేస్తున్నాయి."
"మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానం తిరుగులేని లౌకికవాదం. అయితే గాంధీ పార్టీ పగ్గాలను చేపట్టిన తరువాత ఆ పార్టీకి అంతకు ముందు ఎప్పుడూ లేనంత అపారమైన ప్రజాభిమానాన్ని సమకూర్చడంతో పాటు - ఆయన పార్టీలో పెద్ద ఎత్తున మతతత్వాన్నీ - జాతీయోద్యమంలో పురాణాలను, ప్రతీకాత్మక వాదాన్నీ, మతధర్మ శాస్త్రాల్నీ జొప్పించారు."
- పెరి ఆండర్‌సన్
-
Author: Peri Andersun
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
-
Paperback: 180 Pages
- Language: Telugu