Dakshina Africalo mahaatmodayam (Telugu) - 2016
Regular price
₹ 30.00
ఒక వ్యక్తి వ్యక్తిత్వం వికసించడానికి ఆ వ్యక్తి నివసించిన ప్రదేశం కూడా కారణమవుతుంది. మనిషి జీవితంపై స్థల కాలాలు, సామాజిక పరిణామాలు ప్రభావం చూపిస్తాయి. అప్పటికే పోరాటాలగడ్డ అయిన దక్షిణాఫ్రికా గాంధీజీపై తీవ్రప్రభావాన్ని చూపింది. అదే సమయంలో గాంధీలో అంతర్గతంగా నిబిడీకృతమైన సత్యాహింసల విలువలు, నిజాయితీ, నిక్కచ్చైన స్వభావం దక్షిణాఫ్రికా ప్రజలపై కూడా ప్రగాఢంగా ప్రభావం చూపింది. ఒక రకంగా గాంధీ, దక్షిణాఫ్రికా పరస్పరం ప్రభావితులయ్యారు. ఇటీవల సెప్టెంబరులో నేను దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు వారు గాంధీ నివసించిన ప్రదేశాలను, ఆయన స్మృతి చిహ్నాలను ఎలా పదిలంగా కాపాడుకుంటున్నారో గాంధీగారి ముని మనమడు (గాంధీ మనుమరాలు ఇలాగాంధీ కుమారుడు) చూపించినప్పుడు ఈ విషయం అర్థమైంది.
- Author: Dr. Yaarlagadda Lakshmi Prasad
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 48 pages
- Language: Telugu