Bharathadesanni Vichinnam Chese Prayathnaalu (Telugu) - 2014 - Chirukaanuka

Bharathadesanni Vichinnam Chese Prayathnaalu (Telugu) - 2014

Sale price ₹ 89.00 Regular price ₹ 100.00

కొన్ని దేశాలలో రాయబార కార్యాలయాల్లో పనిచేసిన కాలంలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఇటువంటి కార్యకలాపాలు నా దృష్టికి వచ్చాయి. కాని ఈ పుస్తకం వెల్లడిస్తున్న సమాచారం కాని, దాన్ని స్పష్టంగా వ్యాఖ్యానించడానికి ఆవశ్యకమైన వ్యక్తీకరణ కాని నా వద్ద లేవు.
                                                               - కన్వల్‌ సిబాల్‌, భారత ప్రభుత్వ మాజీ విదేశాంగ శాఖా కార్యదర్శి.
'ఇది చాలా ముఖ్యమైన పుస్తకం. భారత వ్యతిరేక శక్తులు రాజకీయ, ఇంకా ముఖ్యంగా మేధాస్థాయిలో ఎలా తమ పట్టు బిగించాయో భారతదేశాన్ని గురించి అధ్యయనం చేయడమే వృత్తిగా కలవారు కూడా గుర్తించని సమస్యను ఈ పుస్తకం స్పష్టంగా మన ముందు పెడుతుంది. ఎడ్వర్డ్‌ సయీద్‌ పుస్తకం ముస్లిం ప్రపంచం విషయంలో చేసిన పనినే ఈ పుస్తకం భారతదేశ విషయంలో చేసింది. అయితే భారత దేశాన్ని పరిశీలిస్తున్న ప్రముఖులు ఈ పుస్తకం చెప్పే విషయాలను నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ పుస్తకం వాళ్ల నిర్వాకాలనే బయటపెడుతుంది'.
                                                                                                  - కోన్రాడ్‌ ఎల్ట్స్‌, బెల్జియన్‌ విద్వాంసుడు
'సరిగా ఆలోచించే వ్యక్తులు మన చరిత్రను, సాంస్కృతిక భావనలను సరైన మార్గంలో పెట్టవలసిన సమయం ఇది. ముఖ్యంగా దక్షిణభారతీయుల విషయంలో ఇది మరింత ఆవశ్యకం. ఎందుకంటే చాలావరకు నష్టం కలిగిస్తున్నదదే. లౌకికవాదం పేరిట దేశాన్ని అవమానిస్తున్న వాళ్లే, హీనపరుస్తున్న వాళ్లే ఇప్పుడు తమను తాము బయట పెట్టుకుంటున్నారు. నేనేమీ రాజకీయాల్లో ప్రవేశించడం లేదు. కాని ఇటీవల రాజకీయ ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు హిందుమతాన్ని, హిందూ ఆలోచనలను, హిందూ భావనలను, హిందూ ధర్మాన్ని విమర్శించేవారి నిజాయితీ రాహిత్యాన్ని, దంభాచారాన్ని బయపెడుతున్నాయి. ధర్మభావన హిందుమతానికి విశిష్టమైంది. భగవద్గీతనూ, దాని వ్యాఖ్యానాలనూ అధ్యయనం చేసిన అదృష్టవంతులు మాత్రమే ఈ గొప్పదేశం అనుసరించి పోషించిన గొప్ప తాత్త్వికతను అర్థం చేసుకోగలరు'.                                                                                       - చో రామస్వామి, తుగ్లక్‌ పత్రిక సంపాదకుడు

  • Author: A.V. Padmakar Reddy
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 256 pages
  • Language: Telugu



More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out