Bharatha Karmikodyama Charitra (Telugu)
ప్రముఖ ట్రేడ్‌యూనియన్ నాయకులు, ప్రసిద్ధ రచయిత సుకోమల్ సేన్ బృహత్తర రచన 'భారత కార్మికవర్గం - ఆవిర్భావం, ఉద్యమం, 1830-2010' క్షుణ్ణంగా సవరించి, విస్తరించిన తృతీయ ప్రతికి తెలుగు అనువాదం ఇది. రచయిత తొలి ప్రతి ముందుమాటలో పేర్కొన్నట్లు ఇది సంప్రదాయసిద్ధమైన ట్రేడ్‌యూనియన్ చరిత్రలకు భిన్నమైనది. విస్తృతమైన జాతీయ, అంతర్జాతీయ నేపథ్యంలో భారత కార్మికవర్గ పోరాలను రాజకీయాలు, ఆర్థికాంశాల పరస్పర ప్రభావాలను గమనంలోకి తీసుకొని సాగిన రచన ఇది.
భారతదేశంలో కార్మికవర్గ ఆవిర్భావం, సంపన్న దేశాలలో కార్మికవర్గ ఆవిర్భావానికి భిన్నమైన రీతిలో వలసపాలకుల పూర్తి ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో జరిగింది. అందుచేత భారత కార్మికవర్గం పుట్టిన దగ్గర నుండి ఒకవైపున వలసవాదుల రాజకీయ పాలనను, రెండో వైపున దేశ, విదేశీ పెట్టుబడిదారుల ఆర్థిక దోపిడిని ఎదుర్కొవలసి వచ్చింది. ఈ విధంగా భారత కార్మికోద్యమం జాతీయ విముక్తి ఉద్యమంతో పెనవేసుకొని సాగింది. ఈ రకమైన సంబంధం 1947, ఆగస్టులో స్వాతంత్య్రం లభించేవరకు కొనసాగింది. ఆ తర్వాత బడబూర్జువావర్గ ఆధిపత్యంలో భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణం జరుగుతున్న సమయంలో భారత కార్మికోద్యమం ముందుకు సాగింది. 1970 వరకు కొనసాగిన ఈ దశను తొలిప్రతి వివరిస్తుంది. 1970వ దశకం తర్వాత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో చోటుచేసుకున్న మార్పుల పర్యవసానంగా ప్రపంచ కార్మికోద్యమ స్వరూప, స్వభావాలలో కూడా మార్పులు సంభవించాయి. దీనితోపాటు శాస్త్ర సాంకేతిక విప్లవం ఫలితంగా కూడ కార్మికవర్గ నిర్మాణం మరింతగా మారిపోయింది. ఈ అంశాలను 1995 వరకు ద్వితీయ ప్రతిలో రచయిత వివరించారు.
-
Author: Sukumal Sean
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 832 Pages
- Language: Telugu