Atomic Habits (Telugu) Paperback - 2020

Sale price ₹ 299.00 Regular price ₹ 350.00
ABOUT THE BOOK

అటామిక్‌ హాబిట్స్‌
ప్రపంచ వ్యాప్తంగా మిలియన్‌ కాపీలకు పైగా అమ్ముడయిన సంచలనాత్మక పుస్తకం
'అటామిక్‌ హాబిట్స్‌'. సులభంగా మంచి అలవాట్లని పెంచుకోవడానికి, చెడు
అలవాట్లను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్‌ మార్గాలని ఈ
పుస్తకం అందిస్తుంది. అతిచిన్న మార్పులు గొప్ప ఫలితాలకి మార్గం ఎలా
వేస్తాయో తెలియజేస్తుంది. న్యూరోసైన్స్‌ మనస్తత్వ శాస్త్రాల ఆధారంగా
అసాధ్యమైన ఫలితాలను సుసాధ్యం చేసుకునే పలుమార్గాలని సరళంగా, సులభశైలిలో
అందించినదే 'అటామిక్‌ హాబిట్స్‌'.
జేమ్స్‌ క్లియర్‌

ABOUT THE AUTHOR

జేమ్స్‌ క్లియర్‌, రచయిత మరియు వక్త. అలవాట్లు, నిర్ణయం తీసుకోవడం మరియు
నిరంతర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఈయన రాసినవి అనేకం న్యూయార్క్‌
టైమ్స్‌, టైమ్‌ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌ మరియు సిబిఎస్‌ దిస్‌ మాణింగ్‌లో
ప్రచురితమయ్యాయి. అతని వెబ్‌సైట్‌ ప్రతి నెలా మిలియన్ల మంది సందర్శకులను
ఆకర్షిస్తుంది. వందల వేలమంది అతని ప్రసిద్ధమైన ఈమెయిల్‌ వార్తాలేఖకు
సభ్యత్వాన్ని పొందుతున్నారు.
క్లియర్‌ ఫార్చ్యూన్‌ 500 కంపెనీలలో ప్రామాణికమైన ఉపన్యాసకుడు. అతని
పనిని NFL, NBA మరియు MLB లోని జట్లు ఉపయోగిస్తాయి. తన ఆన్‌లైన్‌
కోర్సు, ది హాబిట్స్‌ అకాడమీ ద్వారా, క్లియర్‌ 10,000 మందికి పైగా
నాయకులు, నిర్వాహకులు, శిక్షకులు మరియు ఉపాధ్యాయులకు నేర్పించారు.
జీవితంలోనూ, చేస్తున్న పనిలోనూ మంచి అలవాట్లను పెంపొందించడానికి ఆసక్తి
ఉన్న వ్యక్తులు మరియు సంస్థలకు హాబిట్స్‌ అకాడమీ ప్రధాన శిక్షణా వేదిక.
క్లియర్‌ ఆసక్తిగల వెయిట్‌ లిఫ్టర్‌ మరియు ఫోటోగ్రాఫర్‌ కూడా. అతను తన
భార్యతో కలిసి ఒహియోలోని కొలంబస్‌లో నివసిస్తున్నాడు.

  • Author: James Clear
  • Publisher: Manjul Publishing House
  • Languages: Telugu
  • Paperback: 248 pages


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out