Tatayya Cheppina Neeti Kathalu (Telugu)
సూర్యుడి మీద ఒకరోజు వాయువు సవాలు చేశాడు.''శక్తిలో నన్ను మించిన వారు లేరు'' అన్నాడు.
సూర్యుడు ''ఎవరి శక్తి ఎంతో పరీక్షించుకుందాం'' అన్నాడు.
అంతలో ఒక బాటసారి అటుగా వస్తూ వున్నాడు. అతడు వారి దృష్టిలో ప డ్డాడు. ఆ బాటసారి ఒంటి మీది దుస్తులు ఎవరు తీయిస్తారో వారే గొప్పవారు.'' అని ఒక నిర్ణయానికి వచ్చారు. ''సరే నంటే సరే'' ననుకున్నారు. వాయువు మొదటగా తన శక్తిని ప్రదర్శింపసాగాడు. తన శక్తినంతా ఉపయోగించి గాలిని విసరసాగాడు. గాలివేగం ఎక్కువయ్యేకొద్దీ ఆ బాటసారి తన దుస్తులను ఒంటికి గట్టిగా చుట్టుకోసాగాడు. కాని బట్టలు తీయలేదు.
తరువాత సూర్యుడి వంతు వచ్చింది. సూర్యుడు కొద్ది కొద్దిగా వేగం పెంచసాగాడు. క్రమంగా వేడి ఎక్కువయ్యింది. బాటసారికి విపరీతంగా చెమటలు పట్టాయి. దానిని భరించలేక తన ఒంటి పైనున్న దుస్తులను ఒక్కొక్కటీ తీసివేశాడు. దానితో సూర్యుడు గెలిచాడు. వాయువు మొఖం వెలవెలపోయింది.
నీతి :ఎదుటివారి బలాన్ని అంచనా వేయకుండ గొప్పలకు పోరాదు.
ఇలాంటి ఎన్నో కథల సమాహారమే ఈ "తాతయ్య చెప్పిన నీతి కథలు" పుస్తకం.
- Author: Reddy Raghavaiah
- Publisher: Swathi Book House (Sep-2019)
- Paperback: 32 pages
- Pictures Colour: Colour Pictures
- Languages: Telugu
- Ages: 0-10