Sri Guru Charitra (Nitya Parayana Grandham) (Telugu) Paperback - 2016
శ్రీ గురు చరిత్ర - నిత్య పారాయణ గ్రంథము (పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ)
30న పవిత్ర సాంప్రదాయక కుటుంబంలో శ్రీమాన్ అనంతాచార్య శ్రీమతి బుచ్చమ్మ పుణ్యదంపతులకు నాలుగవ సంతానంగా జన్మించారు పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. తండ్రిగారి ఆదర్శ పెంపకంలో యోగాభ్యాసం నేర్చిన భరద్వాజులు గుడ్డినమ్మకానికి తావీయని రీతిన సత్యాన్వేషణతత్పరత కలిగి ఉండేవారు. వీరి చిన్నతనంలో సంభవించిన దుర్ఘటన కారణంగా జీవము, దైవము, మరణము, కాలము మొదలైన అంశాలపై వారికి ఉదయించిన అనేక ప్రశ్నలను అన్వేషిస్తూ సుదీర్ఘ యోచనలో 6 సంవత్సరాలు గడిపి చివరకు ప్రశ్నలే లేని అద్భుత ఆధ్యాత్మిక స్థితిని పొందారు. అన్ని ప్రశ్నలు సమాధానపడి చక్కటి సమన్వయం కుదిరింది. దైవం యొక్క ఉనికి నిర్ధారణ అయ్యింది. కొద్ది సం॥లు తరువాత శిరీడీ మొదట దర్శనంలో శ్రీ సాయినాధుని సమాధిమందిరంలో వారికే బ్రహ్మానుభూతి కలిగింది. అప్పటినుండీ శ్రీ సాయినాధుని గూర్చి అనేక ఉపన్యాసాలు, ప్రసంగాలు చేసి, గ్రంథాలు రచించి సాయిధర్మ ప్రచారానికి అంకితమయ్యారు శ్రీ భరద్వాజులు. సమకాలీనులైన అనేక మహనీయుల ఆదరణ ప్రశంసలు అందుకున్న ఆచార్య భరద్వాజ 1989 April 12వ తారీకున తమ భౌతిక శరీరాన్ని చాలించారు. కానీ నేటికీ తాము నిత్యసత్యులుగా, పిలిచిన పలికే దైవముగా నిలిచి భక్తులకు అనేక అనుభవాలు భౌతిక సాక్షాత్కారాలు సైతం ప్రసాదించి ఇహపర శ్రేయస్సు ప్రసాదిస్తున్నారు. “మాస్టర్"గా, "ఆచార్యులు"గా ఎందరో భక్తుల ప్రార్ధనలనందుకొని అనుగ్రహిస్తున్నారు.
- Author: Sri Ekkirala Bharadwaj
- Publisher: Sri Manga Bharadwaja Trust
- Pages: 311 Pages
- Language: Telugu