Varnana Rathnakaramu-22 (Telugu) - 2016
Sale price
₹ 189.00
Regular price
₹ 200.00
ప్రాతఃస్మరణీయులు దాసరి లక్ష్మణస్వామిగారు (పిఠాపురం క్రీ.శ. 1930) శ్రమపడి సంకలనం చేసి నాలుగు భాగాలుగా ముద్రించి ఎప్పుడో తొంభైయేళ్ళక్రితం లోకానికి అందించారు వర్ణనరత్నాకరాన్ని. అప్పటినుంచీ పునర్ముద్రణకన్నా నోచుకోని ఈ ఆణిముత్యాల తెలుగు పద్యాల సంకలనాన్ని పాఠకమిత్ర వ్యాఖ్యతో సాహితీప్రియులకు అందిస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవారి ప్రాచీనతెలుగు - అధ్యయన కేంద్రం. మొత్తం వర్ణనరత్నాకరంలో ఎనిమిదివేలకు పైగా పద్యాలు సంకలితమై ఉన్నాయి. నన్నయనుంచి పందొమ్మిదవ శతాబ్దంవరకూ వచ్చిన ముద్రిత-అముద్రిత పద్యకావ్యసమూహాన్ని అవలోడనంచేసి ఆ మహానుభావుడు రూపొందించిన ఈ వర్ణనరత్నాకరానికి ఇప్పుడు ఎందరెందరో పండితులు మా అభ్యర్థన మన్నించి పాఠకమిత్రవ్యాఖ్య సమకూరుస్తూ సహకరిస్తున్నారు. ఇదొక మహా యజ్ఞం. సుసంపన్నం కావాలని
ఆశీర్వదించండి.
- Author: Dasari Lakshmana Swami
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 462 pages
- Language: Telugu