Aneka Sandarbalu (Telugu) - 2013
వార్తకీ వ్యాఖ్యకీ వ్యాసానికీ తేడా కనిపించని నేటి తెలుగు పత్రికా ప్రపంచంలో చక్కని వ్యాసం రాసే సాహిత్య సంప్రదాయం మూర్తీభవించిన సంపాదకుడు కూడా ఉన్నందుకు సంతోషించాలి. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రిక అవగాహనతో పాటు భాషాసాహిత్య జ్ఞానమూ, సృజనాత్మక రచనాశక్తీ పుష్కలంగా కలిగిన పత్రికా సంపాదకుల వరుసలో మనం చివరికి వస్తున్నామేమోనన్న సందేహం కలుగుతుంది. ఆ వరుసలో కె.శ్రీనివాస్ చివరివాడేమోనన్న శంకతోపాటు, కాకూడదన్న బలమైన ఆకాంక్ష కూడా ఉంది.
శ్రీనివాస్ రచన చదివేటప్పుడు అతనితో ఏకీభవించలేని సందర్భాలు అరుదు. చాలా సందర్భాలలో ‘నేనిలా రాస్తే బాగుండును’ అనిపించేలా ఉంటుంది. స్పష్టమైన అవగాహన, దాన్ని మరింత విస్పష్టమైన మాటల్లో పెట్టగలగడం, విషయంతోపాటు శైలీ వడివడిగా చదివించగలగడం శ్రీనివాస్ వ్యాసాల్లో ముఖ్యమైన లక్షణం.
శ్రీనివాస్ ‘అనేక సందర్భాలు’ ఊరికే చదివి ఊరుకోవలసిన రచన కాదు. చదివి ఆలోచించాలి. ఆ సందర్భాలు నిరంతరాయంగా మనముందుకు వస్తూనే ఉంటాయి. మనం ఎటువైపు ఉండాలో, ఏం చేయాలో నిర్ణయించుకోక తప్పదు.
- Author: K. Srinias
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 288 pages
- Language: Telugu